FbTelugu

టూ వీలర్ ఇచ్చాడు… జైలుపాలయ్యాడు!

హైదరాబాద్: ఫ్రెండ్స్ కు, బంధువులకు వాహన్ ఇచ్చే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఇవ్వాలి. లేదంటే మీరు జైలుకు వెళ్లాల్సి ఉంటుంది. డ్రైవింగ్ లైసెన్స్ లేని వారికి వాహనం ఇచ్చినప్పుడు ప్రమాదాలు జరిగినప్పుడు యజమానే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

లైసెన్స్ లేని వ్యక్తి నడుపుతూ ప్రమాదం బారిన పడితే వాహన యజమాని జైలుకు వెళ్లిన ఘటన కూకట్ పల్లిలో జరిగింది. డ్రైవింగ్ లైసెన్స్ లేని తన స్నేహితురాలికి అజయ్ సింగ్ అనే వ్యక్తి తన టూ వీలర్ ఇచ్చాడు. స్నేహితురాలు ఆది రేష్మా టూ వీలర్ ను లారీ ఢీకొనడంతో ప్రమాదానికి గురై చనిపోయింది. పోలీసులు విచారణ తరువాత వాహనం యజమానికి ప్రధాని నిందితుడిగా, లారీ డ్రైవర్ ను రెండో నిందితుడిగా కేసు ను నమోదు చేసి అరెస్టు చేశాడు. అజయ్ సింగ్ (23) హోటల్ మేనేజిమెంట్ విద్యను అభ్యసిస్తున్నాడు.

You might also like

Leave A Reply

Your email address will not be published.