FbTelugu

కాచిగూడలో రెండు రైళ్లు ఢీ…

25 మందికి గాయాలు

పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం

హైదరాబాద్: కాచిగూడ నింబోలి అడ్డలో రెండు రైళ్లు ఢికొన్నాయి. ఈ ఘటనలో 25 మంది ప్రయాణీకులకు గాయాలయ్యాయి. నింబోలిఅడ్డలో ఆగి ఉన్న ఇంటర్ సిటీ రైలును కొద్ది సేపటి క్రితం ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టింది. సిగ్నలింగ్ లో లోపం వల్లే ఆగివున్న ఇంటర్ సిటీని వెనకాల నుంచి ఎంఎంటీఎస్ ఢీకొట్టినట్లు తేలింది. వేగంగా వస్తున్న ఎంఎంటీఎస్ రైలు ఢీకొట్టడంతో ఆగిఉన్న ఇంటర్ సిటీ రైలులో మూడు బోగీలు పక్కకు ఒరిగాయి. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స కోసం సికింద్రాబాద్ రైల్వే ఆసుపత్రికి తరలించారు. రైళ్ల ఢీ తో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.  అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

You might also like