జమ్ముకశ్మీర్: భద్రతా బలగాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైన ఘటన జమ్ము కశ్మీర్ లోని హంద్వారాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళితే.. కశ్మీర్ లోని హంద్వారాలో ఉగ్రవాదులు నక్కారన్న ముందస్తు సమాచారం మేరకు భారత భద్రతా బలగాలు ఆపరేషన్ చేపట్టాయి. ఈ ఆపరేషన్ లో జరిగిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు అక్కడికక్కడే మృతి చెందినట్టు ఆర్మీ అధికారులు తెలిపారు. గత కొన్ని రోజులుగా భారత భద్రతా బలగాలు ఉగ్రవాదులపై వరుసగా విరుచుకు పడుతూ.. ఇప్పటికే పదుల సంఖ్యలో మట్టుబెట్టారు.