FbTelugu

ఇద్దరు ఉగ్రవాదులు హతం

శ్రీనగర్: జమ్మూ కశ్మీర్ లో సోమవారం ఉదయం ఇద్దరు ఉగ్రవాదులను భద్రతా బలగాలు హతం చేశాయి. ఉగ్రవాదుల కదలికలపై సమాచారం ఉన్న భద్రతా బలగాలు ఉదయం బందీపోరా ప్రాంతానికి చేరుకుని కూంబింగ్ చేశారు. తనిఖీలు చేస్తుండగా ఉగ్రవాదులు ఎదురుపడడంతో బలగాలు కాల్పులు ప్రారంభించాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు చనిపోయారు. వారినుంచి మందుగుండు సామాగ్రి, భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు.

You might also like