FbTelugu

మరో ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ము కశ్మీర్: భారత భద్రతాబలగాలు నిన్న పుల్వామా జిల్లాలో జరిపిన ఆపరేషన్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమవ్వగా.. ఇవాళ మరో ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు మట్టుబెట్టాయి. వివరాల్లోకెళితే.. జమ్ము కశ్మీర్ లోని పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు ఉన్నారన్న సమాచారంతో నిన్న భారత భద్రతాబలగాలు ఆపరేషన్ నిర్వహించాయి.

బలగాల జరిపిన కాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదులు నిన్న హతమయ్యారు. నిన్న పారిపోయి మసీదులో నక్కిన మరో ఇద్దరు ఉగ్రవాదులపై ఇవాళ సైన్యం జరిపిన కాల్పుల్లో వారు హతమయ్యారు. దీంతో రెండ్రోజుల్లోనే నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు.

You might also like