FbTelugu

ఆటో, బైక్ ఢీకొని ఇద్దరు యువకులు మృతి

మహబూబ్ నగర్: ఆటో, బైక్ ఢీకొన్న ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన ఘటన జిల్లాలోని దేవరకద్ర మండలం చౌదర్ పల్లిలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే..

ప్రమాదవశాత్తూ ఓ బైక్, ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో కౌకుంట్లకు చెందిన సాయికుమార్, చంద్రబాబులు అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించినట్టు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like