FbTelugu

వైసీపీలోకి ఇద్దరు ఎమ్మెల్యేలు

అమరావతి: వైసీపీ తీర్థం పుచ్చుకునేందుకు ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు సిద్దమయ్యారు. ఇవాళ సాయంత్రం తాడేపల్లిలోని సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరనున్నారు.

ప్రకాశం జిల్లా పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు, గుంటూరు జిల్లా రేపల్లే ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ వైసీపీలో చేరనున్నారు. ఒంగోలు పట్టణం మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో సత్యప్రసాద్, సాంబశివరావులు భేటీ అయి చర్చించారు.

ఆయనతో కలిసి నేరుగా తాడేపల్లిలోని సీఎం అధికారిక నివాసానికి చేరుకోనున్నారు. కొద్దిరోజులుగా ఇద్దరు ఎమ్మెల్యే వైసీపీ ముఖ్య నాయకులు చర్చలు జరుపుతున్నారు.

You might also like