FbTelugu

పండుగ రోజు విషాదం

కడప: పుష్పగిరి ఆలయం సమీపంలోని పెన్నా నదిలో ఇద్దరు విద్యార్థులు గల్లంతయ్యారు. గల్లంతైన విద్యార్థులు కార్తీక్‌, నందకిశోర్‌గా స్నేహితులు తెలిపారు. పోలీసులు స్థానిక ఈతగాళ్లను నదిలోకి దింపి గాలింపు చేయిస్తున్నారు.

మహా శివరాత్రి పండుగ సందర్భంగా ముద్దనూరు మండలం థర్మల్‌ గ్రామంలో తొమ్మిదో తరగతి చదువుతున్న కొంతమంది విద్యార్థులు కలిసి వల్లూరు పరిధిలోని పుష్పగిరి పుణ్యక్షేత్రానికి వెళ్లారు. పుష్పగిరి కొండపై వెలసిన సంతాన మల్లేశ్వర స్వామి, చెన్నకేశవులను అందరూ దర్శనం చేసుకున్నారు. ఆ తరువాత కొండ దిగువన పెన్నానదిలో స్నానమాచరించేందుకు చేరుకున్నారు. ఒడ్డున స్నానం చేసే బదులు ఇద్దరు విద్యార్థులు లోపలికి వెళ్లి గల్లంతయ్యారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.