FbTelugu

భారీ శబ్దంతో పేలిన టైరు..

శ్రీకాకుళం: ఒక ట్రాక్టర్ టైరు కు గాలి ఎక్కిస్తుండగా పేలి ఇద్దరు మృతి చెందారు. జలుమూరు మండంలోని కొమనాపల్లి గ్రామంలో గత రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానికుల కథనం ప్రకారం దాసరి సూర్యనారాయణ (52) కొమనాపల్లి కూడలి వద్ద పాన్‌షాప్ నిర్వహిస్తున్నాడు. దీంతోపాటు సైకిల్ రిపేరింగ్, వాహనాలకు గాలి కొట్టడం వంటివి కూడా చేస్తున్నాడు.

గత రాత్రి దుకాణం మూసివేస్తున్న సమయంలో తిమడాం గ్రామానికి చెందిన బొమ్మాళి గోవింద (45) వచ్చాడు.ట్రాక్టర్ టైరు తీసుకొచ్చి పంక్చర్ వేసి గాలి పెట్టమని కోరాడు. పని పూర్తయిన తరువాత సూర్యనారాయణ గాలి కొడుతుండగా అది ఒక్కసారిగా భారీ శబ్దంతో పేలింది. దీంతో సూర్యనాయణ, గోవింద ఇద్దరూ అమాంతం పైకెగిరిపడ్డారు. ఈ ఘటనలో సూర్యనారాయణ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, తీవ్రంగా గాయపడిన గోవిందను శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాలను పోస్టు మార్టం పంపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.