FbTelugu

చెట్టును ఆటో ఢీకొని ఇద్దరు మృతి

మెదక్: అదుపుతప్పి ఓ ఆటో చెట్టును ఢీకొని ఇద్దరు మృతి చెంది, మరో ఐదుగురికి తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలోని నర్సాపూర్ సమీపంలో హైవేపై చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక నర్సాపూర్ హైవేపై ఓ ఆటో అదుపుతప్పి పక్కనే ఉన్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఐదుగురికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

You might also like