FbTelugu

కేంద్ర ప్యాకేజీతో పేదలకు ఒరిగిందేమీ లేదు: వినోద్ కుమార్

దేశంలో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ డౌన్ కారణంగా దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీని ప్రకటించింది.  కేంద్ర ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల భారీ ప్యాకేజీతో పేదప్రజలకు ఒరిగిందేమీ లేదని తెలంగాణ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ కుమార్‌ అన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేంద్రం ఎంతో ఆర్బాటంగా చెప్పుకుంటున్న భారీ ప్యాకేజీలో దేశంలోని సామాన్యులకు ఉపయోగపడే అంశం ఒక్కటి కూడా లేదని ఎద్దేవా చేశారు. కోట్ల మంది వలస కూలీలకు ఈ ప్యాకేజీ వలన ఏమాత్రం లబ్ది చేకూరట్లేదన్నారు. ఇంతటి విపత్కర పరిస్థితుల్లో విమానాశ్రయాల అభివృద్ధికి నిధులు ప్రకటించడమేంటని తీవ్రంగా ప్రశ్చించారు. ఆర్థిక సంస్కరణలకు ఇది సమయం కాదన్నారు.

You might also like