FbTelugu

మద్యం లేక… స్పిరిట్ సేవించి ఇద్దరు మృతి

భువనగిరి: మద్యం లేకపోవడంతో స్పిరిట్ తాగిన ఇద్దరు యువకులు ఉస్మానియా ఆసుపత్రిలో ప్రాణాలు కోల్పోయారు.

భువనగిరి పట్టణం హోజింగ్ బోర్డు కాలనీ కి ఎదురుగా ఉన్న బస్తీలో నివసించే ఇద్దరు యువకులు ఇవాళ మధ్యాహ్నం స్పిరిట్ సేవించారు. తీవ్ర కడుపు నొప్పితో రావడంతో ఏరియా ఆసుపత్రికి బంధువులు తరలించారు. ఏరియా ఆసుపత్రికి వెళ్లినా వాళ్లు స్పిరిట్ సేవించిన విషయం బయటకు చెప్పలేదు.

వైద్యం చేసినప్పటికీ అదుపులోకి రాకపోవడంతో ఉస్మానియా కు వెళ్లాల్సిందిగా సూచించారు. ఉస్మానియా ఆసుపత్రి వైద్యులకు కూడా తాము స్పిరిట్ సేవించామనే విషయాన్ని చెప్పకుండా దాచారు. నొప్పి పెరగడంతో ఇద్దరూ… తాము స్పిరిట్ తీసుకున్న విషయం వైద్యులకు చెప్పారు. ఈలోపే పరిస్థితి విషమించడంతో ఇద్దరూ ప్రాణాలు విడిచారు.

You might also like