FbTelugu

ఎమ్మెల్యే రోజాకు రెండు ఆపరేషన్లు

చెన్నై: నగరి వైసిపి ఎమ్మెల్యే ఆర్కె.రోజా కు చెన్నైలోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకు రెండు ఆపరేషన్లు విజయవంతంగా నిర్వహించారు. ఆపరేషన్ తరువాత ఆమెను వార్డుకు తరలించారు.

ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో రెండు వారాల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని డాక్టర్లు తెలిపారు. రోజా ఆరోగ్యంపై భర్త సెల్వమణి నియోజకవర్గ ప్రజలకు సమాచారం పంపించారు. కరోనా వైరస్, ఎన్నికల కారణంగా ఆమె ఆపరేషన్లను వాయిదా వేసుకున్నదని తెలిపారు. రోజా ఆరోగ్యం కుదుటపడుతున్నదని, సందర్శకులు ఎవరూ ఆసుపత్రి రావద్దని సెల్వమణి కోరారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.