FbTelugu

టిటిడి అర్చకులకు రెండు ఆఫర్లు

అమరావతి: తిరుమల తిరుపతి దేస్థానం (టిటిడి)లో అర్చకుల కొనసాగింపుపై ఏపీ దేవదాయశాఖ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ మేరకు వంశపారంపర్యంగా అర్చకుల కొనసాగింపునకు రెండు విధానాలు అమలు చేసేందుకు మార్గదర్శకాలు జారీ చేసింది.
ఇందులో టిటిడి నిర్ణయించిన సంభావనతో ఆరోగ్యంగా ఉన్నంతకాలం విధులు నిర్వర్తించవచ్చు.

మరో విధానంలో 65 ఏళ్లకు పదవీ విరమణ చేసి అర్చకత్వం కోసం కుమారుడిని నామినేట్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఈ రెండు విధానాల్లో ఒకదాన్ని ఎంపిక చేసుకునే అవకాశాన్ని అర్చకులకు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవలే పదవీ విరమణ చేసిన ఏవి.రమణదీక్షితులను టిటిడి ప్రధాన అర్చకుడిగా నియమించిన సిఎం జగన్, తాజాగా అర్చకుల కోసం మరో విధానాన్ని ప్రకటించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.