హైదరాబాద్: రాష్ట్రంలో మరో రెండు కొత్త టోల్ ప్లాజాలు సెప్టెంబర్ కల్లా అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో 18 టోల్‌ప్లాజాలు ఉండగా ప్రస్తుతం ఏర్పాటయ్యే రెండింటితో అవి 20కి చేరుకోనున్నాయి.
మాములుగా టోల్‌ఫ్లాజాల ద్వారా నెలకు రూ.80 నుంచి 90 కోట్ల ఆదాయం సమకూరేది. లాక్డౌన్ నేపథ్యంలో సుమారు 50 రోజులకు పైగా ఆదాయం పడిపోయింది. అయితే లాక్డౌన్ సడలింపు నేపథ్యంలో వాహనాలను ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో టోల్‌ప్లాజాల వద్ద ఆదాయం పెరిగింది.
ఈ రెండు ప్లాజాలు ప్రారంభమయితే ఆదాయం రెట్టింపయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు పేర్కొన్నారు. కొత్తగా నిర్మించబోయే రెండు టోల్‌ప్లాజాల్లో ఒకటి స్టేషన్ ఘన్పూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారి 163పై నిర్మాణం జరుగుతుండగా మరొకటి వరంగల్ బైపాస్ వద్ద నిర్మిస్తున్నారు.
రానున్న సెప్టెంబర్ వరకు ఈ రెండు టోల్‌ఫ్లాజాల నిర్మాణం పూర్తి అవుతాయని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు. ఏప్రిల్ నెలలో రూ.11.66 కోట్లు రాష్ట్రంలోని 18 టోల్‌ఫ్లాజాల (ఫాస్టాగ్‌ల) ద్వారా సమకూరింది. ప్రతి నెల 18 టోల్‌ప్లాజాల ద్వారా సుమారు నెలకు రూ.80 నుంచి రూ. 90 కోట్ల ఆదాయం సమకూరుతుందని ఎన్హెచ్ఏఐ అధికారులు తెలిపారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
Prev Post
You might also like