FbTelugu

ఏపి ఆర్టిఐ కి ఇద్దరి పేర్లు సిఫారసు

అమరావతి: సిఎం జగన్‌ మోహన్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమాచార కమిషన్ ఎంపిక కమిటీ సమావేశం. ఈ సమావేశంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్లుగా హరిప్రసాద్, చెన్నారెడ్డి పేర్లను ఎంపిక చేసి రాష్ట్ర గవర్నర్‌ ఆమోదానికి పంపించారు. ఇకపై రాష్ట్రంలో సమాచార హక్కు చట్టం అమలును ఉల్చాల హరిప్రసాద్, న్యాయవాది కాకర్ల చెన్నారెడ్డి పర్యవేక్షించనున్నారు. రెండు దశాబ్దాలుగా పత్రికా రంగంలో జర్నలిస్టుగా హరి ప్రసాద్ సేవలు అందించారు. ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల కోర్టుల్లో, ఉమ్మడి హైకోర్టుల్లో గత 15 ఏళ్ళుగా కాకర్ల చెన్నా రెడ్డి న్యాయవాదిగా పనిచేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.