FbTelugu

సౌరవ్ గంగూలీకి మరో రెండు స్టంట్లు

కొలకతా: బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీకి మరో రెండు స్టంట్లు వేశారు. ఆయనకు నిర్వహించిన యాంజియోప్లాస్టీ విజయవంతమైందని అపొలో హాస్పిటల్ ప్రకటించింది.
రక్తనాళాల్లో పేరుకుపోయిన పూడికలు తొలగించేందుకు అదనంగా మరో రెండు స్టంట్లు వేసినట్లు వైద్యులు తెలిపారు.

ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, శుక్రవారం నాడు హాస్పిటల్ నుంచి డిశ్చార్జీ అవుతారని తెలిపారు. జనవరి మొదటి వారం లో గుండెపోటు రావడంతో అప్పట్లో ఒక స్టంట్ అమర్చారు. ఆరోగ్యం సరిగా లేకపోవడంతో వాయిదా వేశారు. మళ్లీ ఇవాళ రెండు స్టంట్లు వేశారు. సీఎం మమతా బెనర్జీ సౌరవ్ గంగూలీని పరామర్శించారు. గంగూలీకి ఆరోగ్యం బాగానే ఉందని, ఆయన భార్య డోనా తో కూడా మాట్లాడినట్లు మమత మీడియాకు వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.