FbTelugu

రెండు నెలల బిల్లులు రద్దు చేయాలి: కళా

విజయవాడ: కరోనా నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ లో రెండు నెలల కరెంటు బిల్లులను రద్దు చేయాలని టీడీపీ విజయవాడ అధ్యక్షుడు కళా వెంకట్రావు అన్నారు. నేడు విజయవాడలో ఏపీలో విద్యుత్ చార్జీల పెంపునకు వ్యతిరేకంగా టీడీపీ ఆధ్వర్యంలో వెంకట్రావు నిరసన దీక్ష చేపట్టారు.

రాష్ట్రంలో పాత స్లాబ్ విధానమే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఇళ్లలోనే ఉంటూ నిరసనలు తెలపాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పిలుపునిచ్చారు.

You might also like