FbTelugu

ఎదురు కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం

రాయపూర్: ఛత్తీస్ గఢ్- మధ్యప్రదేశ్ సరిహద్దులో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతమైనారు. వివరాల్లోకెళితే.. మావోయిస్టులు ఉన్నారన్న ముందస్తు సమాచారంతో పోలీసులు, ప్రత్యేక బృందాలు కూబింగ్ నిర్వహిస్తూ ఉండగా..

ఒక్కసారిగా మావోయిస్టులు కాల్పులు జరపడంతో పోలీసులు కూడా వారిపై ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందినట్టు తెలిపారు. హతమైన మావోయిస్టులపై రూ.16 లక్షల రివార్డు ఉన్నట్టుగా తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.