FbTelugu

జాతీయ రహదారిపై రెండు లారీలు ఢీ

ప్రకాశం : జాతీయ రహదారిపై రెండు లారీలు బలంగా ఢీకొన్న ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెంది మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలోని కొరిశెపాడు మండలం, తిమ్మనపాలెం దగ్గర చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. స్థానిక తిమ్మన పాలెం దగ్గర వేగంగా వచ్చిన రెండు లారీలు ప్రమాదవశాత్తూ బలంగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఓ వ్యక్తి అక్కడి కక్కడే మృతి చెందగా.. లారీల్లోని మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.