FbTelugu

ఇద్దరు చిన్నారులను బలిగొన్న నీటిగుంత

మంచిర్యాల: నీటి గుంతలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన దారుణ ఘటన జిల్లాలోని తాండూరు మండలం, రేచిని గ్రామంలో చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. గ్రామానికి చెందిన మహేష్(8), తిరుమల్(14) అనే బాలలు ప్రమాదవశాత్తు అనుకోకుండా నీటిగుంతలో పడిపోయారు. ఆ సమయంలో ఎవరూ గమనించకపోవడంతో వారు ఆ నీటిగుంతలోనే మృతి చెందినట్టుగా తెలుస్తోంది.

You might also like