FbTelugu

2 లక్షలు దాటిన కేసులు

న్యూఢిల్లీ: భారతదేశంలో కరోనా వైరస్ కేసులు రెండు లక్షలు దాటాయి. ఇది కూడా కేవలం పదిరోజుల్లోనే కావడం సంచలనం రేపుతున్నది. పది రోజుల క్రితం వరకు రోజుకు లక్ష కేసులు ఉండగా ఇప్పుడవి రెండు లక్షలకు చేరుకున్నాయి.

గడచిన 24 గంటల్లో 2,00,739 కరోనా పాజిటివ్ కేసులు నమోదు అయినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. అలాగే 1038మంది చనిపోయారు. తాజా కేసులతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1.40 కోట్లు దాటగా, ఇప్పటి వరకు మృతి చెందిన వారు 1,73,123కి చేరింది. ఆందోళనకరన స్థాయిలో కేసులు పెరుగుతుండడంతో పలు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమలు చేస్తూ నియంత్రించే ప్రయత్నం చేస్తున్నారు. మహారాష్ట్రలో బుధవారం రాత్రి నుంచి పూర్తి స్థాయిలో కర్ఫ్యూ అమలు చేస్తున్న విషయం తెలిసిందే.

తెలంగాణలో కూడా కరోనా పాజిటివ్ కేసులు ఎగబాకుతున్నాయి. గురువారం ఉదయం విడుదల చేసిన హెల్త్ బులెటిన్ ప్రకారం కొత్తగా 3,307 పాజిటివ్ కేసులు రాగా, 8 మంది మాత్రమే చనిపోయారు. అయితే ఇంత తక్కువ సంఖ్యలో చనిపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం మాదిరి తెలంగాణ కూడా తప్పుడు లెక్కలు చూపిస్తున్నదని ప్రజలు మండిపడుతున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.