FbTelugu

ఆటోను ఢీకొన్న లారీ ఘటనలో ఇద్దరు మృతి

విజయనగరం: సీతానగరం మండలం లచ్చయ్య పేట సమీపంలో శనివారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో ఇద్దరు తీవ్ర గాయాలయ్యాయి.

గాయాలపాలైన ఇద్దరిని ఆసుపత్రికి తరలించారు. పార్వతీపురం నుంచి బొబ్బిలి వైపు ప్రయాణికులతో వస్తున్న ఆటోను ఎదురుగా వస్తున్న లారీ బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో నుజ్జునుజ్జు అవ్వడంతో పాటు ఆటో డ్రైవర్ రాము, ఆటోలో ప్రయాణిస్తున్న ఇంజనీరింగ్ విద్యార్థి సాయి ప్రదీప్ అక్కడికక్కడే చనిపోయారు. ఆటోలో ఉన్న మరో ఇద్దరు మహిళలు ఆటోలోనే తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న సీతానగరం పోలీసులు అక్కడకు చేరుకుని స్థానికుల సహకారంతో గాయపడ్డ ఇద్దరిని వెంటనే బొబ్బిలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి సాయిప్రదీప్ కోమటిపల్లి తాండ్రపాపారాయ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.