FbTelugu

ఆక్సిజన్‌ సిలిండర్ల పేలి ఇద్దరు మృతి

లక్నో: పలు ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్లు నిండుకోవడంతో ప్రాణాలు హరీమంటున్న దుర్ఘటనలు చూస్తున్నాం. ఆక్సిజన్ దొరక్క పలువురు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.
కరోనా పాజిటివ్ బాధితులు ఆక్సిజన్‌ దొరక్క ఇబ్బందులు పడుతుంటే తాజాగా ఆక్సిజన్‌ ప్లాంట్‌లో పేలుడు సంభవించడంతో ఆక్సిజన్‌ సిలిండర్లన్నీ పేలిపోయాయి.

ఈ పేలుడులో ఇద్దరు మృతి చెందారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌ రాజధాని లక్నోలో చోటుచేసుకోవడంతో విషాదం నింపింది. ఈ ఘటన విషయం తెలియగానే వెంటనే అగ్నిమాపక సిబ్బంది స్పందించి సకాలంలో చర్యలు చేపట్టారు. వెంటనే రంగంలోకి దిగడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. ఈలోపే ఇద్దరు మృతి చెందడం అత్యంత బాధాకరమైన అంశం. ఈ ఘటనపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.