FbTelugu

పులివెందులలో కాల్పులు… ఇద్దరు మృతి

కడప: ఏపి సిఎం వైఎస్.జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం లో ఆస్తి తగాదా నేపథ్యంలో కాల్పులు జరిగాయి. ఈ కాల్పల్లో ఇద్దరు చనిపోయారు.

గ్రామస్థుల కథనం ప్రకారం నల్లపరెడ్డి పల్లెలో ప్రసాద్ రెడ్డి అనే వ్యక్తి పార్థసారథి రెడ్డిని తుపాకీతో కాల్చి చంపాడు. ఆ తరువాత తను కూడా అదే తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కాల్పుల ఘటనతో ఒక్కసారిగా గ్రామస్థులు ఉలిక్కిపడ్డారు. స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు గ్రామానికి చేరుకుని తుపాకీ స్వాధీనం చేసుకుని రెండు మృతదేహాలను పోస్టుమార్టం తరలించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.