FbTelugu

పేలుడులో ఇద్దరి మృతి

Two-killed-in-explosion

గుంటూరు: కొత్తపేట శీలంవారివీధిలో సంభవించిన పేలుడులో ఇద్దరు మృతి చెందారు. గురువారం అర్థరాత్రి ఈ పేలుడు జరిగిందని స్థానికులు తెలిపారు. మందుల దుకాణంలో జరిగిన ఈ పేలుడులో రామారావు, రామకృష్ణ మృత్యువాతపడ్డారు. పేలుడు ధాటికి పక్క దుకాణాల తలుపులు, కిటీకీలు దెబ్బతిన్నాయి. అయితే ఈ ప్రమాదంపై స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పేలుడు ప్రాంతాన్ని పరిశీలించిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాలను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

You might also like