FbTelugu

కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు.. ఇద్దరు మృతి

ముంబయి: కెమికల్ ఫ్యాక్టరీలో భారీ పేలుడు సంభవించి ఇద్దరు మృతి చెంది, ఘటన మహారాష్ట్రలోని పాల్ఘార్ జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. పాల్ఘార్ జిల్లాలోని తారాపూర్ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ లో ఒక్కసారిగా భారీ పేలుడు సంభవించింది.

ఈ పేలుడు దాటికి ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందిగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలైనాయి. అప్రమత్తమైన సహాయక సిబ్బంది క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. రియాక్టర్ పేలిన శబ్దం సుమారు 10 కిలోమీటర్ల వరకు వినిపించినట్టు స్థానికులు తెలుపుతున్నారు.

You might also like