FbTelugu

కారు ఢీకొని ఇద్దరు మృతి

హైదరాబాద్: వేగంగా వచ్చిన ఓ కారు ఢీకొనడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన నగరంలోని జూబ్లీహిల్స్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే.. నిన్న రాత్రి బంజారాహిల్స్ లో కరెంటు పోవడంతో కాంట్రాక్ట్‌ కార్మికులు పెద్దబాబు, జగన్‌, కిరణ్‌, సుధాకర్‌, ట్రాన్స్‌కో డ్రైవర్‌ బాలుఆ ప్రాంతానికి వెళ్లారు.

పక్కనే ఉన్న అపార్ట్‌మెంట్‌ వాచ్‌మన్‌ నగేష్‌ టార్చిలైట్‌తో అక్కడకు వచ్చాడు. వారంతా పనుల్లో నిమగ్నమై ఉండగా.. ఓ కారు వారిపైకి దూసుకొచ్చింది. ఈ ఘటనలో వాచ్ మెన్ సహా మరో వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు.

You might also like