FbTelugu

విద్యుత్ స్థంభాన్ని ఢీకొట్టిన కారు… ఇద్దరు మృతి

సూర్యాపేట: జోరుగా వర్షం పడుతున్న సమయంలో వేగంగా వస్తున్న కారు చివ్వెంల మండలంలో జాతీయ రహదారిపై విద్యుత్ స్థంభాన్ని కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మరణించారు. గాయపడిన మహిళను సూర్యాపేటకు తరలించారు.
శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రుద్రంపూర్ కు చెందిన పాల్వాయి అరుణ్ కుమార్ తన భార్యా పిల్లలతో శుక్రవారం జీ తిరుమలగిరిలోని అత్తవారింటికి వచ్చాడు.

అనారోగ్యంతో ఉన్న మామను పరామర్శించి తిరిగి శనివారం సాయంత్రం బయలుదేరాడు. తిరుమలగిరి శివారు లో వేగంతో ఉన్న కారు అదుపు తప్పింది. విద్యుత్ స్థంభాన్ని కారు ఢీకొట్టడంతో అరుణ్ అక్కడే చనిపోయాడు. తీవ్ర గాయాలపాలైన ఆయన భార్య పుష్పలతను సూర్యాపేటకు తరలించగా చికిత్స పొందుతూ ఇవాళ మృతి చెందింది. వీరికి ఒక కుమారుడు (7), ఒక కుమార్తె (4) ఉంది.

You might also like