FbTelugu

కారును ఢీకొన్న బస్సు… ఇద్దరు మృతి

చిత్తూరు: కుప్పం – పలమనేరు జాతీయ రహదారి పీఈయస్ ఆసుపత్రి సమీపంలో వేగంగా వెళ్తున్న ప్రైవేటు బస్సు అదుపు తప్పి కారును ఢీ కొన్నది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందారు.

ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు వి.కోట మండలం పట్రపల్లికి చెందిన వ్యక్తులుగా పోలీసులు గుర్తించారు. డయాలసిస్ చెకప్ కొరకు పీఈఎస్ ఆసుపత్రికి వచ్చి వెళ్తుండగా గణేష్ పురం వద్ద రోడ్డు ప్రమాదం చోటచేసుకుంది. ఘటన జరిగిన తరువాత బస్సు డ్రైవర్ బస్సును అక్కడే వదిలేసి పరారీ అయ్యాడు. అతని కోసం పోలీసులు గాలింపు చేస్తున్నారు. ఈ సమాచారాన్ని బస్సు యజమానికి తెలియచేశారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.