FbTelugu

బస్సు, బైకు ఢీకొని ఇద్దరు మృతి

  సిద్దిపేట : ఆర్టీసీ బస్సు, బైకు ఢీకొని ఇద్దరు మృతి చెందిన ఘటన జిల్లాలోని గజ్వేల్‌ మండలంలోని జాలిగామ శివారులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇవాళ ఉదయం గజ్వేల్‌ ప్రజ్ఞాపూర్‌ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు స్థానిక జాలిగామ శివారులో ఓ బైకును ప్రమాదవశాత్తూ ఢీకొట్టింది.

ఈ ఘటనలో బైక్ పై వెళుతున్న మంద ప్రసాద్‌, ఎర్రోళ్ల డేవిడ్‌ అక్కడికక్కడే మృతిచెందారు. మరో యువకునికి తీవ్రగాయాలైనాయి. ఈ ఘటనపై కేసునమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.