FbTelugu

ఆటో, మినీ వ్యాన్ ఢీకొని ఇద్దరు మృతి

అనంతపురం: ఆటో, మినీ వ్యాన్ ఢీకొని ఇద్దరు వ్యక్తులు మృతి చెంది మరో ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన జిల్లాలోని బత్తుల పల్లి దగ్గర చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక బత్తుల పల్లి దగ్గర ప్రమాదవ శాత్తూ ఓ మినీ వ్యాన్, ఆటో బలంగా డీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడికే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలైనాయి. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు.

You might also like