FbTelugu

మద్యం అనుకొని కెమికల్స్ తాగి ఇద్దరు మృతి

యాదాద్రి: మద్యం వాసన వస్తున్న ఓ కెమికల్ ను తాగి ఇద్దరు మృతి చెందిన ఘటన జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లాక్ డైన్ వల్ల రాష్ట్రంలో ఎక్కడా మద్యం లభించడం లేదు. ఈ నేపథ్యంలో మద్యం అలవాటున్న షేక్ బాబా, రియాజ్ అనే వ్యక్తులు రెండ్రోజుల క్రితం ప్లాస్టిక్ డ్రమ్ ను ఓ రసాయనంతో శుభ్రం చేశారు.

ఆ రసాయనం మధ్యం వాసన (స్పిరిట్ వాసన) రావడంతో అందులో నీరు కలుపుకుని మత్తువస్తుందని తాగారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైనారు. వారిని ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి ఇద్దరూ మృతి చెందినట్టు తెలిపారు.

You might also like