FbTelugu

యువకుల ఎగతాళి… దూకిన యువతులు

లక్నో: ఇద్దరు ఇంటర్ విద్యార్థులు పరుగెత్తుతున్న బస్సు నుంచి కిందకు దూకడంతో గాయాలపాలయ్యారు. తమ సీటు ఎదురుగా కూర్చున్న యువకుల ఎగతాళి మాటలు, డ్రైవర్ నిర్లక్ష్యపు సమాధానంతో భీతిల్లిన యువతులు ఈ చర్యకు దిగారు.

బస్సు డ్రైవర్, ఇద్దరు యువకులపై యువతుల తల్లిదండ్రులు పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. డ్రైవర్, యువకులు రాజీ పడడంతో కేసు వెనక్కి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. రన్ హెరా గ్రామానికి చెందిన ఇద్దరు ఇంటర్ యువతులు సొంత గ్రామానికి వెళ్లేందుకు గురువారం పది గంటలకు ప్రైవేటు బస్సు ఎక్కారు. తమ ఊరు దగ్గరకు వస్తుండడంతో వారు స్టేజీ దగ్గర ఆపాల్సిందిగా డ్రైవర్ ను కోరగా, కుదరదని చెప్పారు. ఈ బస్సు మీ ఊరు నుంచి వెళ్లడం లేదని సమాధానం చెప్పాడు.
ముందు సీట్లో కూర్చున్న యువకులు ఈ రోజు బస్సు మీ ఊరి స్టేజీ వద్ద ఆగదు, ఇక చూడు మీ కష్టాలు అంటూ వెకిలిగా మాట్లాడారు. అటు డ్రైవర్, ఇటు యువకుల సూటిపోటి మాటలను భరించలేని యువతులు బస్సులోంచి కిందకు దూకేశారు. గాయాలైనా లెక్క చేయకుండా ఇంటికి పరుగులు తీశారు. బస్సులో జరిగిన గొడవ గురించి తల్లిదండ్రులకు వివరించారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.