* మృతులు ఆలయ ఈవో, జూనియర్ అసిస్టెంట్
గాంధీనగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు హైదరాబాదీలు మృతి చెంది మరో ముగ్గురికి తీవ్ర గాయాలైన ఘటన గుజరాత్ లోని సూరత్ లో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఉత్తరాది నదీ జలాల కోసం దేవాదాయ శాఖ ఉద్యోగులు కారులో గుజరాత్ వెళ్లారు. కారును వేగంగా వచ్చిన ఓ లారీ బలంగా ఢీకొట్టింది.
ఈ ఘటనలో అడిక్ మెట్ ఆంజనేయ స్వామి ఆలయ ఈవో శ్రీనివాస్, పాన్ బజార్ వేణుగోపాల స్వామి దేవస్థానంలో జూనియర్ అసిస్టెంట్ గా పని చేస్తున్న రమణ అక్కడికక్కడే మృతి చెందారు. మరో ముగ్గురికి తీవ్ర గాయాలైనాయి. ఈ ఘటనపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ కమిషనర్ అనిల్ కుమార్ ను ఆదేశించారు.