FbTelugu

రెండు హాస్పిటళ్లు… 500 మంది వైద్యులకు కరోనా!

పాట్నా: కరోనా సెకండ్ వేవ్ లో రోగుల ప్రాణాలను కాపాడేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది అహర్నిశలు పనిచేస్తున్నారు. విపత్కర పరిస్థితుల్లో పనిచేస్తున్న వైద్యులను కరోనా వైరస్ భూతం వెంటాడుతుండడం కలకలం రేపుతోంది.

బిహార్ రాష్ట్రంలో రెండు ప్రధాన హాస్పిటళ్లలో సుమారు 500 మందికి పైగా వైద్యులు, వైద్య సిబ్బందికి కరోనా సోకింది. ఎయిమ్స్ హాస్పిటల్ తో పాటు పాట్నా మెడికల్ కాలేజీ హాస్పిటల్ లో ఇప్పటి వరకు 500 మందికి పైగా దీని బారిన పడ్డారు. ఎయిమ్స్ లో మొత్తం 384 మందికి నిర్థారణ కాగా, వీరిలో ఎక్కువగా వైద్యులు, నర్సులు ఉన్నారని మెడికల్ సూపరింటెండెంట్ సిఎం సింగ్ తెలిపారు. పాట్నా మెడికల్ కాలేజీలో 70 మంది వైద్యులు సహా 125 మంది ఆరోగ్య సిబ్బందికి సోకింది. వీరందరినీ ప్రత్యేక ఐసోలేషన్ లో ఉంచి చికిత్స చేస్తున్నారు. అధిక సంఖ్యలో వైద్యులకు కరోనా రావడంతో మిగతా వైద్యుల పై ఒత్తిడి పెరిగింది. వైద్యులు, వైద్య సిబ్బంది సెలవులు రుద్దు చేశారు. బుధవారం నాడు ఒక్కరోజే బిహార్ లో 12వేలకు పైగా కొత్త పాజిటివ్ కేసులు రాగా 56 మంది చనిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.