కృష్ణా: ప్రమాదవశాత్తు చెరువులో మునిగి ఇద్దరు బాలికలు మృతిచెందిన విషాద ఘటన జిల్లాలోని బంటుమిల్లి మండలం, మల్లేశ్వరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకెళితే..
మల్లెశ్వరానికి చెందిన హర్షిత, యషిత అనే ఇద్దరు బాలికలు అనుకోకుండా ప్రమాదవ శాత్తూ చెరువులో పడి చనిపోయారు. ఈ ఘటనతో ఊళ్లో విషాధ ఛాయలు అలముకున్నాయి. అయితే ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.