FbTelugu

బొలేరో ఢీకొని ఇద్దరు రైతులు మృతి

అనంతపురం: బొలేరో వాహనం ఢీకొని ఇద్దరు రైతులు మృతి చెందిన ఘటన జిల్లాలోని బెలుగుప్ప మండలం, హామినిరెడ్డిపల్లి దగ్గర చోటుచేసుకుంది.

వివరాల్లోకెళితే.. వేగంగా వచ్చిన ఓ బొలేరో వాహనం ప్రమాదవశాత్తు ఇద్దరు రైతుల పైనుంచి దూసుకెళ్లింది ఈ ఘటనలో ఇద్దరు రైతులూ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై మరింత సమాచారం అందాల్సి ఉంది.

You might also like