FbTelugu

పులివెందులలో ఒకేరోజు రెండు ఘటనలు

కడప: పులివెందుల బ్రాహ్మణపల్లి రోడ్డు లో శివరాణి హత్య ఆదివారం జరిగింది. దీనిపై పోలీసులు విచారణ జరుగుతుండగానే… అదేరోజు రాత్రి మెకానిక్ ఆశా కిరణ్ పై గుర్తుతెలియని దుండగులు దాడి చేశారు.
తీవ్ర గాయాలతో పులివెందుల ఆస్పత్రిలో ప్రథమ చికిత్స పొందాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్ కు తరలించారు. ఒక్క రోజే వేర్వేరు ఘటనల్లో హత్యలకు దారి తీస్తున్న సంఘటన ఉలిక్కిపడేలా చేసింది. ఇప్పటికే కరోణ మహమ్మారితో పోలీసులు రేయింబవళ్ళు కష్టపడుతుంటే ఇలాంటి సంఘటనలు కలించి వేస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చేపట్టారు.

You might also like