FbTelugu

రెండు డోసులు… అయినా 40 మందికి కరోనా

లక్నో: కరోనా వైరస్ ఏమో గాని మహమ్మారి ప్రారంభం మొదలు ఇప్పటి వరకు చిత్ర విచిత్రాలు చోటు చేసుకుంటున్నాయి. నెలలు గడుస్తున్న కొద్ది కొద్ది సంచలన విషయాలు వెలుగు చూస్తూ నిద్ర పట్టనివ్వకుండా చేస్తున్నాయి.

లక్నోలని కింగ్ జార్జి మెడికల్ యూనివర్సిటీలో 40 మంది వైద్యులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. రెండు డోసులు తీసుకున్న తరువాత కూడా కరోనా సోకడం వైద్యులను కలవర పెడుతున్నది. సోకిన వారిలో 20 మంది సర్జరీ డిపార్ట్ మెంటు, 9 మంది యూరాలజీ డిపార్ట్ మెంట్ వైద్యులు ఉన్నారు. రెండో డోసు తీసుకున్న రెండు వారాల తరువాత కరోనా సంక్రమించడం సవాల్ గా మారింది. ఎందుకు వచ్చింది, ఎలా వచ్చిందనే దానిపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా ఈ వార్త తెలుసుకుని ఆశ్చర్యానికి గురైంది.
ఉత్తరప్రదేశ్ లో మంగళవారం సాయంత్రానికి 5928 పాజిటివ్ కేసులు నిర్థారణ అయ్యాయి. ముప్పై మంది ప్రాణాలు కోల్పోయారు. లక్నో నగరంలో ఒక్కరోజే 1188 కేసులు కొత్తగా నమోదు కాగా, ఏడు మంది చనిపోయారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.