FbTelugu

శామీర్ పేట చెరువులో తేలిన ఇద్దరు వైద్యుల శవాలు

మేడ్చల్: శామీర్ పేట చెరువులో రెండు మృతదేహాలు లభ్యకావడం కలకలం రేపింది. ప్రమాదవశాత్తు చెరువులో పడి మరణించారా, ఎవరైనా చంపేసి తోసేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అల్వాల్ లో హోమియో వైద్యులుగా పనిచేస్తున్న నందన్, గౌతమ్ లు ఆదివారం సాయంత్రం శామీర్ పేట చెరువు వద్దకు చేరుకున్నారు. సాయంత్రం వెళ్లిన ఇద్దరు సోదరు తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని గజ ఈతగాళ్లను చెరువులోకి పంపించింది. రెండు మృతదేహాలు లభ్యం కాగా, అవి తమ కుమారులవేనని తల్లిదండ్రులు ధృవీకరించారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం పంపించి, కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.