FbTelugu

ఏపి హైకోర్టులో రెండు కేసులు వాయిదా

అమరావతి: అమరావతి రాజధాని తరలింపు అంశంపై హైకోర్టులో విచారణ వాయిదా పడింది. తదుపరి విచారణ ఆగస్టు 23న నిర్వహించనున్నట్లు హైకోర్టు తెలిపింది.
రాజధాని తరలింపు అంశంపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వం తరఫున, పిటీషనర్ల తరఫున అడ్వకేట్లు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ముందు వాదనలు విన్పించారు. వాదోపవాదనల తరువాత తదుపరి విచారణను ఆగస్టు 23కు వాయిదా వేసింది.

పరీక్షల పిటీషన్ వాయిదా…

ఆంధ్రప్రదేశ్ లో టెన్త్, ఇంటర్ పరీక్షల నిర్వహణ సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు విచారణ జూన్ 2 కి వాయిదా వేసింది. హైకోర్టు సూచన మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఇంటర్ పరీక్షలు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. టెన్త్ పరీక్షలపై నేడో రేపో ప్రభుత్వం నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.