FbTelugu

రెండు నాటు పడవలు మునక… 8మంది గల్లంతు

విశాఖపట్నం: ఆంధ్రా ఒడిశా సరిహద్దు (ఏఓబి) లో తీవ్ర విషాదం చోటు చేసుకున్నది. సీలేరు నదిలో రెండు నాటుపడవలు మునగడంతో ఎనిమిది మంది గిరిజన కూలీలు గల్లంతయ్యారు.
మల్కాన్ గిరి జిల్లా కెందుగూడ వద్ద ఈ ఘటన జరిగింది. స్థానికులు సమాచారం ఇవ్వగానే పోలీసులు అక్కడకు చేరుకుని గాలింపు చర్యలు మొదలు పెట్టారు. గజ ఈతగాళ్లు నదిలోకి దిగి మృతదేహాల కోసం వెదుకులాడుతున్నారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ లో పనులు లేకపోవడం, లాక్ డౌన్ కారణంగా ఒడిశా వలస కూలీలు తిరిగి స్వగ్రామాలకు బయలుదేరారు.

సోమవారం అర్ధరాత్రి కి సీలేరు కు 11 మంది వలస గిరిజన కూలీలు చేరుకున్నారు. ఒడిశా కు వెళ్లడానికి అడ్డగిస్తారేమో అనే భయంతో అడ్డదారిన సీలేరు కంపెనీ కాలువ వద్దకు చేరుకున్నారు. 11 మంది గిరిజనులు స్వగ్రామమైన ఒడిశాలోని మల్కన గిరి జిల్లా కు రెండు నాటు పడవలపై బయల్దేరి వెళ్లారు. మొదటి బయలుదేరిన నాటు పడవ మునిగిపోవడంతో అందులోని గిరిజనులు కొంతమంది వెనుక వస్తున్న నాటుపడవ ని పట్టుకోవడం తో అది కూడా మునిగిపోయింది. దీంతో పడవలో ఉన్న వాళ్ళందరూ నీట మునిగారు. ముగ్గురు ఈత కొట్టుకుంటూ ఒడ్డుకు చేరుకోగా ఎనిమిది మంది గల్లంతయ్యారు. ఒకరి మృతదేహం లభ్యమైంది. గల్లంతైన వారు గుంటవాడ, కెందుగూడా వాస్తవ్యులు అని పోలీసుల దర్యాప్తులో తేలింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.