FbTelugu

రెండు పడవలు ఢీ… 25 మంది మృతి

ఢాకా: బంగ్లాదేశ్ లోని షిబ్ చర్ పట్టణ సమీపంలోని పద్మా నదిలో ఇవాళ రెండు పడవలు ఢీకొన్న ఘటనలో పాతిక మంది మునిగి చనిపోయారు. రెండు పడవల్లో ముప్పై మంది ఉండగా మొత్తం నీట మునిగారు.

వీరిలో ఐదుగురిని కాపాడామని బంగ్లాదేశ్ పోలీసు చీఫ్ మీరజ్ హోసేన్ మీడియాకు తెలిపారు. పడవల నిర్వహణ సరిగా లేకపోవడం, ఎక్కువ మంది పడవలో ఎక్కడం వల్ల ఈ ప్రమాదం సంభవించింది. గత నెల నారాయణ గంజ్ వద్ద జరిగిన పడవ ప్రమాదంలో ముప్పై మంది మరణించిన విషయం తెలిసిందే. 2015 ఫిబ్రవరిలో జరిగిన పడవ ప్రమాదంలో 78 మంది దుర్మరణం చెందారు. బంగ్లాదేశ్ లో తరచూ పడవ ప్రమాదాలు జరుగుతుంటాయి. రవాణ వ్యవస్థ సక్రమంగా లేకపోవడంతో ప్రజలు తమ గమ్యస్థానాలకు చేరేందుకు పడవలను ఆశ్రయిస్తుంటారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.