FbTelugu

ట్విట్టర్ ట్రెండింగ్… బాబ్రీ జిందా హై…

ఒకవైపు శతాబ్ధాల కల నెరవేరుతుండగా మరో వైపు బాబ్రీ జింది హై అంటూ ట్విట్టర్ లో యమ ట్రెండింగ్ కావడం విశేషం. బాబ్రీ మసీదు ఇంకా బతికే ఉంది అంటూ హ్యాష్ టాగ్ ఇండియాలో ఇవాళ ట్రెండింగ్ అయ్యింది.
కరసేవకులు నాడు మసీదు కూల్చివేసిన దృశ్యాలను ప్రస్తావిస్తూ పలువురు నెటిజన్లు ట్వీట్ చేశారు. దీనిపై పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. అయితే ఇదే అంశంపై మజ్లీస్ పార్టీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ట్వీట్ చేస్తూ హ్యాష్ టాగ్ చేశారు. బాబ్రీ పాత చిత్రం, మసీదు కూల్చివేత సమయంలో తీసిన చిత్రాన్ని రెండింటిని కలిపి షేర్ చేశారు. బాబ్రీ మసీదు ఉండేది, ఉంటుంది అని కూడా ట్విట్ లో స్పష్టం చేశారు.

నెటిజన్లు ఇదే ట్యాగ్ పై పెద్దఎత్తున ట్వీట్లు చేశారు. బాబ్రీ మసీదు మసీదుగా ఉంది, ఎప్పటికీ మసీదుగానే ఉంటుందని, మా తరువాతి తరాల వారికి ఇదే విషయాన్ని చెబుతాం అంటూ ఒక నెటిజన్ వ్యాఖ్యానించారు. ఇండియన్ మీడియా, అధికార వ్యవస్షథలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ లకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయని పలువురు విమర్శించారు.

You might also like