FbTelugu

కేంద్రానికి షాకిచ్చిన ట్విటర్

న్యూఢిల్లీ: భారత ప్రభుత్వం అంటే మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విటర్ లెక్క లేకుండా పోయింది. ఏం చేయలేరనే ధీమాతో దుశ్చర్యకు పాల్పడుతునే ఉన్నది. తాజా దుశ్చర్యపై కేంద్రం అగ్గిమీద గుగ్గిలం అవుతోంది.
ఇండియా చిత్రపటం నుంచి జమ్మూ కాశ్మీర్ ను తొలగించింది. జమ్మూ కాశ్మీర్ పాకిస్థాన్ లో అంతర్భాగమని చూపించింది.

ఇక్కడితో ఆగకుండా లద్దాఖ్ ను వేరే దేశంగా చూపించడంతో రచ్చ మొదలైంది. ఇప్పటికే ఐటి చట్టాల అమలుపై ట్విటర్, కేంద్ర ప్రభుత్వ మధ్య తీవ్ర యుద్దం నడుస్తోంది. ఆగ్రహంతో ఉన్న కేంద్ర ప్రభుత్వం ట్విటర్ పై ప్రత్యక్ష చర్యలకు దిగేందుకు సిద్ధమవుతున్నది. ఇటీవలే కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్విటర్ ఖాతాను స్థంభింప చేసింది. ఎప్పుడో రెండేళ్ల క్రితం షేర్ చేసిన వీడియోలో మ్యూజిక్ కాపీ రైట్ ఉందని బ్లాక్ చేసింది. ఈ చర్యపై మంత్రి రవిశంకర్ ప్రసాద్ మండిపడ్డారు. ఈ ఘటన నుంచి తేరుకోకముందే మరో దుశ్చర్యకు ఒడిగట్టడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.