FbTelugu

ట్రంప్ కు గట్టి షాక్ ఇచ్చిన ట్విటర్

లాస్ ఏంజెల్స్: ప్రముఖ మెస్సేజింగ్ సర్వీసు ట్విటర్ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు గట్టి షాక్ ఇచ్చింది. ఎంత చెప్పినా వినకుండా చిన్న పిల్లాడి మాదిరి చిల్లరగా ప్రవర్తిస్తున్న ట్రంప్ ను దాదాపు పక్కన పెట్టింది.
ఆయన వినియోగిస్తున్న అధికారిక ట్విటర్ ఖాతాను నూతనంగా ఎన్నికైన జోసెఫ్ ఆర్. బైడెన్ కు అప్పగించాలని నిర్ణయించింది.

ఇటీవల జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ విజయం సాధించిన విషయం తెలిసిందే. అమెరికా అధ్యక్షుడి ఖాతా బదలాయింపు కోసం ట్రంప్ బృందానికి, బైడెన్ టీముకు మధ్య ఎలాంటి చర్చలు అవసరం లేదని ట్విటర్ ప్రకటించింది. బైడెన్ బాధ్యతలు స్వీకరించిన క్షణమే అన్ని అధికారిక ఖాతాల్లోని సమాచారాన్ని సేకరించి వైట్ హౌస్ అధికారులకు అందచేస్తామని పేర్కొంది.
గతంలో బదలాయించినట్లుగానే ఇప్పుడు కూడా అధికారులను సంప్రదించిన ఆ ప్రక్రియను పూర్తి చేస్తామని ట్విటర్ ప్రతినిధి నిక్ పసిలియో తెలిపారు. అమెరికా అధ్యక్షుడి ఖాతాకు 32 మిలియన్ల మంది అనుసరిస్తున్నారు.

You might also like

Leave A Reply

Your email address will not be published.