FbTelugu

ట్విటర్, ఫేస్ బుక్ రేపటి నుంచి పనిచేయదా?

న్యూఢిల్లీ: సోషల్ మీడియా సంస్థల కట్టడికి కేంద్ర ప్రభుత్వం విధించిన గడువు ఇవ్వాళ్టితో ముగియనున్నది. ప్రభుత్వం ఆదేశించిన విధంగా మే 26వ తేదీ లోపు ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉండగా ఇంత వరకు చేసుకోలేదు. గడువు పెంచమని కోరతారా లేదా అనేది తెలియాల్సి ఉంది.

కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం మే 26 నాటికి నోడల్ వ్యవస్థ ఏర్పాటుచేయని సంస్థలు పనిచేసే పరిస్థితి లేదు. ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్ వంటి సంస్థలపై కేంద్ర ప్రభుత్వ కత్తి వేలాడుతున్నది. అన్ని సోషల్ మీడియా సంస్థలు, ఓటిటి లు తమ ఫ్లాట్ ఫామ్ లపై పోస్టు చేసే సమాచారం విషయంలో జాగరూకతతో ఉండాలని, ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదు కోసం నోడల్ ఆఫీసర్ వ్యవస్థ ను నియమించాలని స్పష్టం చేసింది. ఫిర్యాదు అందిన 24 గంటల్లో సమాధానం పంపించాలని ఆదేశించింది. 15 రోజుల్లోగా పరిష్కరించేందుకు ప్రధాన ఫిర్యాదు అధికారి, కింది స్థాయి వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రం స్పష్టం చేసింది. అందరూ భారతీయులే ఉండాలని, ఇలా ఎన్నో నిబంధనలు విధిస్తూ నోటీసులు పంపించింది. అయితే ఇంత వరకు ఏ ఒక్క సంస్థ కూడా నోడల్ వ్యవస్థను ఏర్పాటు చేయలేదు. ఒక్క ‘‘కూ’’ సంస్థ ఎవరూ ముందుకు రాలేదు. మరో మూడు నెలల గడువు కావాలని సోషల్ మీడియా సంస్థలు అడుగుతున్నాయి.

You might also like

Leave A Reply

Your email address will not be published.