FbTelugu

నైజీరియాలో ట్విటర్ నిషేధం

అబుజా: సోషల్ మీడియా సంస్థలు ప్రపంచంలో హద్దులు దాటుతున్నాయి. ఎవరైనా ఫిర్యాదు చేసినా, తమ దృష్టికి వచ్చినా ముందూ వెనకా ఆలోచించకుండా ఖాతాలను స్థంభింపచేయడం లేదా శాశ్వతంగా తొలగించడం చేస్తున్నారు.
దేశంలో చెలరేగుతున్న అల్లర్లపై నిరసనకారులను ఘాటుగా హెచ్చరిస్తూ అధ్యక్షుడు మొహమ్మదు బుహరీ ట్వీట్ చేశారు. ఐదు దశాబ్ధాల క్రితం ముప్పై నెలల పాటు జరిగిన పౌర యుద్దం వల్ల తలెత్తిన పరిణామాలు వస్తాయని హెచ్చరించారు. ప్రభుత్వాన్ని విచ్చిన్నం చేసేందుకు కుట్రలు చేస్తున్నవారు వెంటనే ఘర్షణలు విరమించుకోవాలని బుహారీ స్పష్టం చేశారు. ఈ ట్వీట్ ను ట్విటర్ నిర్థాక్షిణ్యంగా తొలగించడం తో నైజీరియా ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.
ఈ చర్యను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ట్విటర్ కార్యకలాపాలను పూర్తిగా నిలిపివేసింది. దేశంలో శాంతి పరిరక్షణ కోసం అధ్యక్షుడు బుహారీ చేస్తున్న కృషిని ట్విటర్ అడ్డుతగులుతూ, సంఘ వ్యతిరేక శక్తులు, దేశ వ్యతిరేక శక్తులకు వంతపాడుతోందని ఆరోపించింది.

ప్రభుత్వాన్ని కూలదోయాలన్ని విచ్చిన్నకారులకు, అసాంఘీక శక్తులకు ట్విటర్ మద్ధతు పలుకుతోందని ఆరోపించింది. తూర్పు నైజీరియా ప్రాంతాన్ని స్వతంత్ర రాజ్యంగా ప్రకటించాలని కోరుతూ కనూ అనే నాయకుడు నేతృత్వంలో నిరసనలు జరుగుతున్నాయి. దీనిపై రెఫరెండం నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రస్తుతం మన దేశంలోనూ ట్విటర్, ప్రభుత్వం మధ్య వివాదం నడుస్తోంది. గూగుల్, షేస్ బుక్, వాట్సప్, కూ, టెలిగ్రామ్, లింకుడిన్, షేర్ చాట్ ప్రభుత్వం ప్రకటించిన నూతన డిజిటల్ నిబంధనల ప్రకారం నడుచుకుంటామని వెల్లడించాయి. ట్విటర్ మాత్రం ఢిల్లీ హైకోర్టులో కేంద్రానికి వ్యతిరేకంగా పిటీషన్ వేసింది.

You might also like

Leave A Reply

Your email address will not be published.