FbTelugu

దివ్య మృతిలో ట్విస్ట్

విశాఖ: రెండ్రోజుల క్రితం విశాఖలో అనుమానాస్పదంగా మృతి చెందిన దివ్య కేసులో ట్విస్ట్ చోటుచేసుకుంది. రావులపాలెం నుంచి 8 నెలల క్రితం విశాఖ వచ్చిన దివ్యను వసంత (నిందితురాలు) అనే మహిళ ఆశ్రయం కల్పించి అసాంఘిక కార్యకలాపాలు చేయించినట్టుగా పోలీసులు గుర్తించారు.

అయితే వారి మధ్య డబ్బు పంపకాల్లో వచ్చిన విభేదాలతో వసంత మూడు రోజుల పాటూ కనీసం ఆహారం కూడా పెట్టకుండా దివ్యను అతికిరాతకంగా హత్య చేయించినట్టుగా పోలీసులు నిర్ధారించారు. దివ్య శరీరమంతా వాతలు, ముఖం, తలపై గాయాలున్నట్టు పోలీసులు గుర్తించారు. గుండు గీసి, కనుబొమ్మలను సైతం కత్తిరించి చిత్రహింసలకు గురిచేసి హత్యచేసినట్టుగా తెలిపారు. ప్రస్తుతం దివ్య మృతదేహం కేజీహెచ్ మార్చురీలో ఉంది. వసంతను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

You might also like